ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో శ్రీవారిని దర్శించుకోనున్నారు అన్నా లెజినోవా. ఇందుకోసం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. అనంతరం టీటీడి అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన అన్నా లెజినోవా.. తలనీలాలు సమర్పించుకున్నారు. వరాహ స్వామిని దర్శించుకున్నారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి.