తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. పది నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ విహరించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన భక్తుడు ఈ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చెప్పులతో వచ్చిన ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.