తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగియనుండటం, వారాంతం కావటంతో శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో 95 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక్క రోజులో ఇంత మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారని టీటీడీ తెలిపింది. అలాగే అన్న ప్రసాద వితరణ, తలనీలాలు సమర్పణ, లడ్డూల విక్రయాలు వంటి విషయాల్లోనూ గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో అధికంగా నమోదైనట్లు తెలిపింది.