Ap High Court On Tirumala Tourism Canteen: తిరుమలలో టూరిజం డిపార్ట్‌మెంట్ క్యాంటీన్లను నిర్వహించకుండా సబ్ లీజుకు ఎందుకు ఇచ్చారని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. తిరుమలలో క్యాంటీన్ నిర్వహణకు టీటీడీ అనుమతులిస్తే.. ఆ క్యాంటీన్‌ను మరొకరికి సబ్ లీజుకు ఇవ్వడానికి టెండర్లు పిలవడాన్ని ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పర్యాటకశాఖ, టీటీడీ ఈవోను ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రతాప్ రెడ్డి ఈ లీజు వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.