శ్రీవారి దర్శనానికి వెళ్లిన కల్వకుంట్ల కవిత తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జై ఆంధ్ర అంటూ పేర్కొన్న కవిత.. త్వరలోనే పార్టీని పెట్టనున్నట్లు వెల్లడించారు. అయితే తమ పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్ అని పేర్కొ్న్నారు. ఢిల్లీ మద్యం కేసులో క్లీన్‌చిట్ రావడంతో శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పిన కవిత.. తన కుమారుడితో కలిసి అలిపిరి మెట్ల మార్గం నుంచి కొండపైకి చేరుకున్నారు. రేపు ఆమె శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.