తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మలయప్పస్వామి, కృష్ణస్వామి తిరుచ్చిలో వేంచేశారు.ఆ తర్వాత పార్వేట మండపములో పుణ్యాహము, ఆరాధన, నివేదనం, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉభయదారులైన తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి. అనంతరం కృష్టస్వామిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు తీసుకువచ్చి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. ఆ తర్వాత మలయప్ప స్వామి తరపున అర్చకులు ఈటెను మూడుసార్లు విసిరారు. దీంతో పార్వేట ఉత్సవం పూర్తైంది.