Tirumala Police Prevent Telangana Devotee Suicide Bid: తిరుమలలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలంగాణ భక్తుడిని పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన మునిసాత్విక్ అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించగా, సకాలంలో స్పందించిన పోలీసులు అతడిని రక్షించారు. మరోవైపు, ట్యాక్సీ డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో శివ అనే డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.