Tirumala Food Safety New Wing: తిరుమలలో భక్తుల ఆహార భద్రత కోసం టీటీడీ ఒక ప్రత్యేకమైన ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తిరుమలలో భక్తులకు అందించే ఆహార నాణ్యతను పెంచడానికి, కల్తీని అరికట్టడానికి ఈ విభాగం పనిచేస్తుంది. త్వరలో ఒక సీనియర్ ఫుడ్‌సేఫ్టీ అధికారిని నియమిస్తారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్ కూడా ఏర్పాటు కానుంది. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపడుతోంది.