Tirumala Police TTD Vigilance Raids: తిరుమలలో భక్తుల భద్రత కోసం పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొండపై అనధికారికంగా ఉంటున్న వారిని, యాచకుల్ని గుర్తిస్తోంది. వారందరిని బస్సుల ద్వారా తిరుపతికి తరలిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ తరచూ నిర్వహిస్తున్నారు. తాాజాగా మరో 62మందిని గుర్తించి తిరుపతికి తీసుకెళ్లారు. అలాగే తిరుమలలో వ్యాపారుల్ని కూడా ప్లోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. పనుల్లో పెట్టుకునేవారి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.