TTD Vigilance Raids in Balaji nagar: తిరుమల కొండపైకి అనధికారికంగా ప్రవేశించే వారికి టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. కొండపైకి అనుమతి లేకుండా ప్రవేశించడం సహా.. ధ్రువీకరణ పత్రాలు లేకుండా నివశిస్తూ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆదివారం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బాలాజీ నగర్ వెనుక ఉన్న షెడ్లలో సోదాలు చేశారు. పనులు పూర్తైనప్పటికీ కొంతమంది కూలీలు, కార్మికులు అక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. ఇకపై ఎప్పటికప్పుడు రైడింగ్ చేస్తుంటామని.. అనుమతి లేకుండా నివశిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరించింది.