ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట కూడా గెలుపొందనప్పటికీ.. వైఎస్ షర్మిల నేతృత్వంలో బరిలోకి దిగగలిగింది. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగలిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు చేకూర్చేందుకు వైఎస్ షర్మిల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే.. మరోవైపు కీలక అంశాలలో సూచనలు చేస్తున్నారు. తాజాగా గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్టు గురించి షర్మిల స్పందించారు. తీగలతో పాటుగా వెనుకున్న డొంకలు కూడా కదిలేలా విచారణ చేయాలని సూచించారు.