కాంగ్రెస్ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ప్రవీణ్.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. సొంత పార్టీలోని ఓ వర్గం నేతలను, సొంత ప్రభుత్వాన్ని విమర్శించటమే కాకుండా.. అనుచిత వ్యాఖ్యలతో దూషించటంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న పూర్తిగా పరిధి దాటి మాట్లాడారని.. ఆయనను వదిలే ప్రసక్తి లేదంటూ మండిపడుతున్నారు. కచ్చితంగా అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు.