తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కొత్త పెళ్లయిన వధువులకు ప్రభుత్వం తరపున ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2024- 25 బడ్జెట్‌లో కళ్యాణ లక్ష్మి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్.. 2175 కోట్లు కేటాయించగా.. మొదటి దశలో 1225.43 కోట్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. ఇప్పటికే.. ఈ ఏడాది 65026 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు రాగా.. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు మరో 31468 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం విశేషం.