తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కల్పించడంతో పాటు నెలవారీ పెన్షన్, హెల్త్‌కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రయోజనాలు అందించే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలిపింది. కమిటీ సభ్యులు కేశవరావు, కోదండరామ్, రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డి తదితరులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జేఏసీలతో జరిపిన సంప్రదింపుల నివేదికను అందించారు. ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం పేర్కొన్నట్లు తెలిపారు.