హైదరాబాద్ పాతనగరం మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని HMRL, HAML అదనపు ఎండీ బి.అజిత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దారుషిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం 888 ప్రభావిత ఆస్తుల్లో 833 ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 55 ఆస్తుల్లో ఉన్న వారసత్వ, పురాతన భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యుత్, నీటి పైపులు తదితర యుటిలిటీల తరలింపును, ఆస్తుల తొలగింపును వేగవంతం చేసి త్వరగా ఆర్వోడబ్ల్యూ అందుబాటులోకి తేవాలని సూచించారు.