TPCC New Chief: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షున్ని అధిష్ఠానం ఖరారు చేసింది. గత కొంత కాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా నియమిస్తూ హైకమాండ్ ప్రకటించటంతో.. అందరి అనుమానాలకు తెరదించినట్టయింది. అయితే.. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మాత్రం మొండి చెయ్యే మిగిలినట్టయింది.