తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటే డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌తోనూ సంప్రదింపులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ సెషన్స్ నేపథ్యంలో విస్తరణ కుదిరే ఛాన్స్ లేదని అన్నారు.