తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లను దాటినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. 2 లక్షలకు పైగా కొత్త కార్డులు, 29 లక్షలకు పైగా కొత్త సభ్యులు రేషన్ కార్డుల్లో చేర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం 79.49% కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయన్నారు. కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిసింది.