కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల ద్వారా అఫ్లికేషన్లు తీసుకోగా.. ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆయా లబ్ధిదారులకు కార్డులు మంజూరు చేయనున్నారు. ఉగాది నుంచి కొత్త కార్డుల జారీకి రేవంత్ సర్కార్ సిద్దమైన సంగతి తెలిసిందే.