Ec Recognized Telangana Janasena Party: జనసేన పార్టీకి తెలంగాణలో కూడా ఓ శుభవార్త అందింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీని తెలంగాణలో కూడా గుర్తిస్తూ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనసేనను ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పుడు తెలంగాణలో కూడా గుర్తించారు.