Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కులగణన, బీసీ రిజర్వేషన్ల గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. కాగా.. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రావాలని, రేవంత్ రెడ్డే తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి అంటూ కొందరు ఘాటు స్టేట్‌మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు భవిష్యత్తులో బీసీ వ్యక్తే సీఎం అవుతారని.. అప్పటివరకు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.