తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అమరరాజా కంపెనీ ఛైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సెల్ మాన్యుఫాక్చరింగ్ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గల్లా జయదేవ్.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కంపెనీకి కొన్ని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చిందని.. ఈ సర్కారు వాటిని నెరవేర్చకపోతే తమ ప్లాంటు విస్తరణకు వేరే చేటు వెతుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.