తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండో అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డినే కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. మెుదటి స్థానానికి సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పేరును ఇప్పటికే హస్తం పార్టీ ఫైనల్ చేసింది. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి సుదీర్ఘ చర్చలు, అన్ని అంశాలను పరిగిణలోనికి తీసుకొని వేం నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇవాళ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.