Bhatti Vikramarka on Indira Dairy Program: తెలంగాణలో పాడి రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ' పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి రెండు గేదెలను ఉచితంగా అందజేయనున్నారు. భూమి లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదు నెలల్లో నియోజకవర్గంలో పథకం అమలు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ పథకం పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు.