Andhra Pradesh High Court On Road Accidents: ఏపీలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చలానాలు కట్టనివారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి, భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయంటూ లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నించింది.