తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ పండగలాంటి వార్త వినిపించింది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాది పండుగ సందర్భంగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మటంపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది రోజునే ఈ కార్యక్రమం ప్రారంభమవనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.