తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ గుడ్‌న్యూస్ వినిపించారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నవారు ఎగిరిగంతేసే తీపి కబురు చెప్పారు. కొత్త రేషన్ కార్డులతో పాటు హెల్త్ ప్రొఫైల్ కోసం.. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబస్ 17 నుంచి మరోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహిస్తామని.. అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.