తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’తో పాటుగా ఇటీవల ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర గీతంతో పాటు, తెలంగాణ తల్లి ఫోటోను ముంద్రించనున్నారు.