తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు త్వరలోనే రానున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ కొత్త అధ్యక్షుడి రేసులో పలువురు నేతలతో పాటు ఈసారి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కే పార్టీ బాధ్యతలు అప్పగించనున్నరన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని బండి సంజయ్ కుండ బద్దలు కొట్టేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడి విషయంలో అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.