తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఇందులో దేశీయ, విదేశీ మద్యం కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలే కాకుండా కొత్త కంపెనీలు కూడా తెలంగాణ లిక్కర్ మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వానికి వస్తున్న దరఖాస్తులను బట్టి చూస్తే.. తెలంగాణలో లిక్కర్ దందాకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.