తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగానే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తెలంగాణలో సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుందంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇదే క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు.