ఉన్నత విద్య అభ్యసించినా ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మారుతున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఆదిలాబాద్‌లోని ఆర్‌సెటి (గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ) ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, మొబైల్ రిపేరింగ్ వంటి కోర్సుల్లో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఉచిత భోజనం, యోగాతో పాటు, స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు కూడా అందిస్తూ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.