తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 14)తో ముగిసిపోతుండగా.. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఏప్రిల్ 24వ తేదీ వరకు గడువును పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందులో 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది.