తెలంగాణలోని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణవ్యాప్తంగా మే 23 వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బృందాలు గ్రామాలలో పర్యటించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నాయి.