రాష్ట్రంలో నాణ్యమైన సన్నవరి సాగును ప్రోత్సహించి, రైతులకు లాభదాయకమైన ఆదాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కేవలం 7 రకాల సన్నవరి సాగుకే మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనుంది. నిర్దిష్ట ప్రమాణాలు కలిగిన రకాలకే ఈ లబ్ధి వర్తిస్తుంది. బోనస్ పొందేందుకు రైతులు నెల రోజుల్లోగా క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ నిర్ణయంతో 38.19 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.