తెలంగాణ రైతులకు శుభవార్త.. లోన్ల కోసం దరఖాస్తులు.. ఒక్కో రైతుకు రూ.6 లక్షల చొప్పున..

6 months ago 25
తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా రైతులకు నెలకు రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. మార్చిలో నిధులు అందగానే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.
Read Entire Article