తెలంగాణ రైల్వే స్టేషన్లకు కొత్త రూపు.. సోలార్‌, ఈవీ ఛార్జింగ్‌తో ఆధునిక సదుపాయాలు

4 hours ago 1
తెలంగాణలో అమృత్‌ భారత్‌ పథకం కింద రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రామగుండం, జనగామ, మహబూబాబాద్‌, బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్లలో పనులు 99 శాతం పూర్తయ్యాయి. నల్గొండ, మల్కాజిగిరి, యాకుత్‌పుర, వికారాబాద్‌ తదితర స్టేషన్లలోనూ పనులు దాదాపు పూర్తయ్యాయి. సోలార్‌ విద్యుత్‌, ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక వెయిటింగ్‌ హాళ్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.714.73 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
Read Entire Article