అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లిన ఖమ్మం విద్యార్ధి వరుణ్ రాజ్. గతేడాది అక్టోబర్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. వరుణ్ జిమ్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతోన్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు కత్తితో అతడి కణతపై పొడిచి పారిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు డాక్టర్లు సర్జరీ చేశారు. అయితే, 9 రోజుల తర్వాత వరుణ్ మృతిచెందాడు.