Telangana swimmer Tejas: పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో.. దేశంలో జరుగుతున్న ఓ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ ఖాతాలో ఓ పతకం చేరింది. జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ తేజస్ కాంస్యం పతకం కైవసం చేసుకున్నాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్విమ్మర్ తేజస్ మూడో స్థానంలో నిలవగా.. మొదటి రెండో స్థానాల్లో.. మిజోరాంకు చెందిన లాంచెన్‌బా లైటోంజమ్, కర్ణాటకకు చెందిన థాకురియా అక్షజ్ రెండో స్థానాల్లో నిలిచారు.