తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో.. గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనుండగా.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీకి 2, తెలంగాణకు ఒక స్మార్ట్ సిటీని కేటాయించింది. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.