తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకం కోసం కసరత్తులు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్యానెల్ లిస్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ లిస్ట్ నుంచి యూపీఎస్సీ ముగ్గురు అధికారుల పేర్లను సిఫారసు చేస్తుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు రవి గుప్తా, సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రాతోపాటు మరికొందరు రేసులో ఉండగా పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.