Telangana Rains: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.