తెలంగాణలో మళ్లీ వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ షాక్ ప్రమాదం ఉండే అవకాశముంది.