తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండు శుభవార్తలు వినిపించింది. ఇప్పటికే.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద తెలంగాణలోని జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ కేటాయించింది. మరోవైపు.. దేశంలో కొత్త ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. తెలంగాణలోని 10 నగరాల్లో 30 ఎఫ్ఎమ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.