తెలంగాణలో బయోగ్యాస్ ప్లాంట్ల అభివృద్ధి కోసం రూ. 1,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. బయోవెస్ట్, స్పెచ్‌టెక్, ఏకోమాక్స్ ఎనర్జీ సంస్థలు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతతో అధిక మొత్తంలో బయో మీథేన్ ఉత్పత్తి చేయడంతో పాటు.. కొన్ని వేల ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. ఈ ఇండో-దక్షిణాఫ్రికా సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి ఒప్పందంలో భాగంగా.. దక్షిణాఫ్రికాకు చెందిన స్పెచ్‌టెక్ ఇంజనీర్స్ తమ అత్యాధునిక బయోగ్యాస్ శుద్ధి వ్యవస్థలను తెలంగాణకు చెందిన బయోవెస్ట్‌కు అందిస్తుంది.