ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. రాష్ట్రంలో ఈనెల 21 నుంచి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే మార్చి 22 నుంచి పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. తూర్పు తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన తుపాన్లకు అవకాశం ఉందని హెచ్చరించారు.