తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కలిపే కుట్ర జరుగుతోందని కవి నందిని సిధారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, నాయకులు ఈ కుట్రలో భాగమని ఆయన ధ్వజమెత్తారు. మౌనంగా ఉంటే తెలంగాణ చిహ్నాలు మాయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలకు, రాజకీయానికి ప్రాంతం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.