తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.