Hyderabad Police Commissioner: తెలంగాణ ప్రభుత్వం మరోసారి పోలీస్ శాఖలో బదీలీలు చేపట్టింది. పలువురు కీలక ఐపీఎస్ ఉన్నతాధికారులకు స్థాన చలనం కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేయగా... అదే స్థానంలో ఏసీబీ డీజీగా ఉన్న డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పేరున్న సీవీ ఆనంద్‌ను మరోసారి నగర కమిషనర్‌గా తీసుకోచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.