తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఈ జాబితాలో తేలింది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.